Monday, December 23, 2024

సిఎం రేవంత్‌ను కలిసిన అటవీ శాఖ అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అటవీ శాఖ సీనియర్ అధికారులు సోమవారం నాడు కలిశారు. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ , హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ నేతృత్వంలో పలువురు సీనియర్ అటవీశాఖ అధికారులు డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, పూల బొకేలు, మొక్కలను అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్‌లు ఎలూసింగ్ మేరు, సువర్ణ, ఎంసి పర్గెయిన్‌లతో పాటు సునీతా భగవత్, బి. షఫియుల్లా, ప్రియాంక వర్గీస్, సోనిబాల దేవి, రామలింగం, రాంబాబు, హైదరాబాద్ ఛీప్ కన్జర్వేటర్ సైదులు, డిఎఫ్‌ఓ ఎం. జోజి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News