Monday, January 20, 2025

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసు: ఇద్దరు గిరిజనులకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గత సంవత్సరం నవంబర్ 25న చండ్రుగొండ మండలం, ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధుల్లో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు గురువారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు. పోకలగూడెం ఫారెస్ట్ బీట్‌లోని ప్లాంటేషన్ లో పశువులు మెపుతున్న గొత్తికోయలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. వారిని బయటకు పంపే ప్రయత్నంలో ఆగ్రహించిన గొత్తికేయలు వారి వద్ద ఉన్న ఆయుధాలతో రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు దాడి చేశారు.

తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీనివాస‌రావుని చికిత్స కోసం త‌ర‌లిస్తుండ‌గానే క‌న్నుమూశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో నిందితులు మడకం తులా, పోడియం నంగాలను పోలీసులు వెంటనే అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈరోజు కోర్టు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విదిస్తూ తీర్పు వెల్లడించింది. హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News