Monday, December 23, 2024

మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి, కోటి వృక్షార్చన లో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి మొక్కలు నాటారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో 256 ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు.

అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువ‌నుంది. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించారు. 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 74వ పార్కును ఇవాళ ప్రారంభించారు.

పార్క్ ప్రత్యేకతలు:

విస్తీర్ణం: 256 ఎకరాలు
వ్యయం: రూ. 7.38 కొట్లు
పొడవు: 5.6 కి. మీ.
మొక్కలు: 50 వేల రకాలు
ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.
వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News