Wednesday, January 22, 2025

సమవృద్ధిగా వానలు కురవాలంటే అడవులను రక్షించాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : సమృద్ధిగా వానలు కురవాలంటే అడవులను రక్షించి చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడాలని , ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని డిఐజి ఎల్.ఎస్. చౌహన్ అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం జడ్చర్లలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభాగంలో పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యం అవుతుందని, పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు కరిగిపోతున్నాయని దీని వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. అందుకే వర్షపాతం తగ్గడమే కాకుండా వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని , మానవ జీవితమే అల్లకోలలం అవుతుందని, ఈ పరిస్థితులలో మార్పు తేవడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు.

ప్రతి ఒక్క వ్యక్తి విధిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. మొత్తం జిల్లాలోని 1890 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ కె. నర్సింహ, అదనపు ఎస్పీ రాములు, డిఎస్పీలు మహేష్ , రమణారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాసులు, సిఐ, ఎస్‌ఐ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News