Monday, December 23, 2024

సిఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ ఎంపి రమేష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. పిసిఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించిన పత్రాలపై సంతకాలు ఫోర్జరీ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. వందల కోట్ల రూపాయల పత్రాలు కావడంతో పోలీసులు కేసును హైదరాబాద్ సిసిఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో స్టేట్‌మెంట్ కోసం కావూరి భాస్కర్‌రావు సిసిఎస్ పోలీసుల ఎదుట శనివారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ కేసులో తన స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు రమ్మన్నారని తెలిపారు. అరగంట పాటు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారని, కంపెనీకి సంబంధించిన సంతకాలు ఫోర్జరీ చేసి సిఎం రమేష్ రూ.450 కోట్లు కొట్టేశాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తెలిపారు. సిబిఐ విచారణ చేస్తే సిఎం రమేష్ వేల కోట్ల స్కాంలు బయటకు వస్తాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News