Thursday, January 23, 2025

సంక్షేమ వసతి గృహాల్లో క్షమమే..?

- Advertisement -
- Advertisement -

కుభీర్ : ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని, రుచి శుభ్రత కలిగిన భోజనాన్ని అందిస్తున్నామని గొప్పులు చెప్పుకుంటుంది. వసతి గృహాల్లో అంతా క్షమమే అన్నట్టుగా ఉంది. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం కుభీర్ మండల కేంద్రంలోని సంక్షేమ వసతి గృహాలు ఆదివారం వసతి గృహాలను పరిశీలిస్తే ఈ విధంగా కనిపించింది. తహశీల్దార్ కార్యాలయానికి పక్కనే ఉన్న ఎస్‌సి హాస్టల్ 15 రోజులు గడస్తున్నా ఇంకా వంటలు ప్రారంభం కాలేదు.

విద్యార్థులు లేక తాళం వేసి కనిపించింది. వసతి గృహానికి కనీసం బోర్డు కూడా లేక ఫ్లెక్సీతో మాత్రం కనిపించి కనిపించనట్లుంది. ఇక్కడ పని చేస్తున్న అధికారికి మూ డు హాస్టళ్లలో బాధ్యత ఉండడంతో ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. పక్కనే ఉన్న కస్తురిబా గాంధీ బాలికల పాఠశాలలో మెనూ ప్రకారం చికెన్ పెట్టాల్సి ఉండగా నీళ్ల పప్పు పెట్టారు. ఆలు కర్రీతో సరిపెట్టారు. ఆదివారం కావంతో విద్యార్థులను కలవడానికి వచ్చిన పేరెంట్స్ కొత్తగా చేరిన విద్యార్థుల పేరెంట్స్‌కు బాధతో చెప్పుకున్నారు.

సిబ్బంది మాత్రంమేమే చికెన్ పెడుతున్నాం మీరు ఎందుకు ఇంటి నుంచి తీసుకవచ్చారు అంటూ గర్జించారు. తీరా విద్యార్థులను పేరెంట్స్ మధ్యాహ్నం ఏం తిన్నారని అడ్డగా సిబ్బంది డొల్లతనం బయటపడింది. పప్పు పెట్టి చికెన్ అంటూ చెప్పడం ఏంటని సిబ్బందిపై మండిపడ్డారు. వసతి గృహాలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇంకా సరఫరాల లోపం వలనే టెండర్లు పూర్తి కాలేదు. బదులిచ్చారు. జిల్లా స్థాయి అధికారులు సంబంధిత వసతి గృహాలపై పర్యవేక్షణ జరిపి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరైన వసతులు కల్పించే విధంగా చూడాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News