Monday, December 23, 2024

మియాపూర్‌లో ఫోర్లేకో రేటు

- Advertisement -
- Advertisement -

మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోయింది. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్షంతో మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, మయూర్ నగర్ కాలనీ, జేపి నగర్‌తో సహా పలు కాలనీలలో అక్రమ నిర్మాణాలు పట్టుగొడుగుల్లా వెలుస్తున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. అంతే కాకుండా నిర్మాణ దారుల నుంచి అందినకాడికి పుచ్చుకుంటు వారికి అండగా నిలిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడడక్కడ అక్రమ నిర్మాణాలకు నోటీసుల రూపంలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చిన, పూర్తి స్థాయిలో మాత్రం అక్రమ నిర్మాణాలను నిలువరించలేపోతున్నారు.

టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో పై స్థాయి అధికారులకు ఫిర్యాదు అందితే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్మాణదారుల కొమ్ముకాస్తూ కిందిస్థాయి సిబ్బంది ఫ్లోర్‌కి ఒక రేట్, సెల్లార్‌కి ఒక రేట్ అంటు బాగానే వెనకేసుకుంటున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియకుండా, ఎటువంటి సమాచారం లేకుండా భారి ఎత్తున్న అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని భహుళ అంతస్థుల నిర్మిణాలు జరుగుతున్నాయ అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్న, వాటికి అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుండి సమాదానం కరువయ్యింది.
న్యూ కాలనీలో పూర్తిగా అనుమతి లేని భహుళ అంతస్థుల నిర్మాణం…
మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో టౌన్‌ప్లానింగ్ విభాగం నుండి ఎటువంటి అనుమతులు లేకున్న నాలుగు అంతస్థుల భారీ నిర్మాణం జరుగుతున్న ఇప్పటి వరకు అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. అధికారుల కళ్లు గప్పి ఇంతటి భారీ నిర్మాణం చేపట్టి ఉండోచ్చు అని అనుకున్న నమ్మడానికి కాస్తా సందేహంగా ఉందని స్థానికులు అంటున్నారు.

నిర్మాణం జరుగుతన్నాప్పటి నుండే దాని చుట్టు చక్కర్లు కొట్టే టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఇలాంటి అనుమతులు లేని నిర్మాణం కనబడకపోవడం విడ్డురంగా అనిపిస్తున్న అదే నిజమని బల్లా గుది మిర చెపుతుంటే పలు అనుమానాలకు దారితీస్తుంది. నిర్మాణాని బట్టి, వేసుకునే అంతస్థులను బట్టి రేటును ఫిక్స్ చేసుకుంటూ అక్రమ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారాయని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
హెచ్‌డిఎఫసి బ్యాంక్ వెనకల ఐటెన్షన్ రోడ్డులో కమార్షియల్ నిర్మాణం…
మియాపూర్ బొల్లారం రోడ్డు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వెనకల ఐటెన్షన్ రోడ్డులో కమార్షియల్ నిర్మాణం చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు నోటిసులు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు.

అనుమతులకు విరుద్ధంగా, కమార్షియల్ నిర్మాణం చేపట్టిన ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని, ట్రాన్స్ ఫార్మర్ కు ఆనుకొని నిర్మాణం వెలుస్తున్న అటు ఎలక్ట్రిసిటి అధికారులు, ఇటు టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి చర్యలు లేవని, ఎటువంటి ఫైర్ సేప్టి కూడా లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై ఉన్నతాధికారులైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
టీఎస్‌బీపాస్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ ఏసిపి రాజ్ కుమార్…
అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులపై టీఎస్‌బీపాస్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ ఏసిపి రాజ్ కుమార్ అన్నారు.

అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి అక్రమ నిర్మాణంపై చర్యలు ఉంటాయని, ప్రజలు జీహెచ్‌ఎంసీ అనుమతులు తీసుకోని, ప్రభుత్వ నిబంధనల ప్రాకారం నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News