Sunday, September 8, 2024

నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి

- Advertisement -
- Advertisement -

Agriculture

 

హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. సావిత్రీ బాయిపూలే జయంతి పురస్కరించుకుని హాకా భవన్‌లో ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు. వ్యవసాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని అగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాములు మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం స్వరూపం సంపూర్ణంగా మారిపోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ధేశించిన లక్ష్యాల కోసం అందరం కలిసి పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అందరి అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అన్ని సంఘాలు ఒక తాటి మీదకు రావాలనే తన ఉద్దేశమన్నారు. దానికి అందరూ సహకరించాలన్నారు. జ్యోతిబా పూలె గారి గురించి అందరికి కొన్ని విషయాలు తెలియదన్నారు. ముంబయిలో బ్రిటీష్ ఇండియా కాలంలో రైల్వేస్టేషన్ ను నిర్మించిన ధనవంతుడయిన కాంట్రాక్టరని, మార్పు తన నుండే మొదలు కావాలని వారు తన సతీమణినే మొదట చదివించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, టాడా అధ్యక్షుడు రాజరత్నం, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Form of Agriculture change in four years
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News