మన తెలంగాణ/హైదరాబాద్ : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కొత్త ప్రణాళికలు రూపొందించిం ది. క్రమబద్ధమైన అభివృద్ధి, ఆదాయ వనరులను సమీకరించడమే లక్ష్యంగా జిల్లాకేంద్రంగా ము న్సిపాలిటీలు, గ్రామాలను కలుపుకొని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(యూడిఏ)లను ఏర్పాటు చే సింది. రాష్ట్రంలో 21 యూడీఏల ఏర్పాటు చేసిం ది. హెచ్‌ఎండిఏ తరహాలోనే ప్రతి యూడిఏకు ప్ర త్యేక మాస్టర్ ప్లాన్‌ను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీనే రూపొందించనుంది. దాని అనుగుణంగానే టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నారు. లే ఔట్లు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం ప్రణాళిక ప్రకా రం చేపట్టనున్నారు. ఆయా జిల్లా కేంద్రాలతో పా టు సమీపంలోని గ్రామాల్లో రోడ్ల నెట్‌వర్క్‌ల అభివృద్ధి, తాగునీటి సరఫరా, ఉపాధి కల్పన, శాటిలైట్ టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం గా ఈ అథారీటీలను ఏర్పాటు చేసినట్టు ప్రభు త్వం పేర్కొంది. డెవలప్‌మెంట్ చార్జీలను యూడిఏనే వసూలు చేయనుంది. వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగంగా వనపర్తి టౌన్, 5 మున్సిపాలిటీలు, 215 గ్రామాలను కలుపుకొని వనపర్తి యూడిఏను ఏర్పాటు చేయగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మున్సిపాలిటీతో పాటు 152 గ్రామాలను కలిపి వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంగా సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు 5 మున్సిపాలిటీలు, 264 గ్రామాలను కలిపి యూడిఏ, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 4 మున్సి పాలిటీలు, 286 గ్రామాలతో కలిపి యూడిఏను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 2 మున్సిపాలిటీలు, 279 గ్రామాలతో స్తంభాద్రి యూడిఏను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మున్సిపాలిటీతో పాటు 4 మున్సిపాలిటీలు, 492 గ్రామాలతో కలిపి వికారాబాద్ యూడిఏగా, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 3 మున్సిపాలిటీలు, 147 గ్రామాలతో శాతవాహన యూడిఏను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి మున్సిపాలిటీతో పాటు 5 మున్సిపాలిటీలు, 466 గ్రామాలతో సంగారెడ్డి యూడిఏ, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 3 మున్సిపాలిటీలు, 380 గ్రామాలతో నిజామాబాద్ యూడిఏ, నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీతో పాటు 3 మున్సిపాలిటీలు, 420 గ్రామాలతో నిర్మల్ యూడిఏ,
మహబూబాబాద్ జిల్లాలో టౌన్‌షిప్‌తో పాటు 4 మున్సిపాలిటీలు, 159 గ్రామాలతో మహబుబాబాద్ యూడిఏను ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో టౌన్‌తో పాటు 4 మున్సిపాలిటీలు, 319 గ్రామాలతో నాగర్‌కర్నూల్ యూడిఏను, మంచిర్యాల జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 350 గ్రామాలతో మంచిర్యాల్ యూడిఏ, మహబూబ్‌నగర్ జిల్లాలో టౌన్ మున్సిపాలిటీతో పాటు 153 గ్రామాలతో మహబుబ్‌నగర్ యూడిఏను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒక గ్రామంతో కొత్తగూడెం యూడిఏను ఏర్పాటు చేశారు. కామారెడ్డి యూడిఏలో 3 మున్సిపాలిటీలు, 460 గ్రామాలు ఉన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, 199 గ్రామాలతో కాగజ్‌నగర్ యూడిఏ, 4 మున్సిపాలిటీలు, 194 గ్రామాలతో జోగులాంబ గద్వాల్ యూడిఏ, ఆదిలాబాద్ టౌన్‌తో పాటు ఒక మున్సిపాలిటీ, 107 గ్రామాలతో ఆదిలాబాద్ యూడిఏను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాకేంద్రంగా నారాయణపేట యూడిఏ, రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా రామగుండం యూడిఏను ఏర్పాటు చేశారు. రామగుండం కార్పొరేషన్‌తో చుట్టుపక్కల గ్రామాలైన 198 గ్రామాలు విలీనం చేయనున్నారు.
యూడిఏకు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్‌లు సంబంధిత అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీల(యూడీఏ)కు చైర్మన్‌లుగా వ్యవహారించనున్నారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సంబంధిత శాఖ నామినీ, పురపాలక శాఖ డైరెక్టర్, డైరెక్టర్ చేసిన నామినీ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డిటిసిపి)లు ఉంటారు.