Monday, December 23, 2024

ప.బెంగాల్‌లో 7 కొత్త జిల్లాల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Formation of 7 new districts in West Bengal

రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపినట్లు ఆమె చెప్పారు. కొత్త జిల్లాలుగా బెర్హంపూర్, కండి, సుందర్‌బన్స్, బషీర్‌హట్, ఇచ్చమటి, రానాఘాట్, బిష్ణుపూర్ ఏర్పడనున్నాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాలు ఉంటాయి. పరిపాలనను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమత విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News