Sunday, January 19, 2025

రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రతిపాదిం చింది. దర్పల్లి, డిచ్‌పల్లి మండలాల్లోని ఏడు గ్రామాలను చేరుస్తూ రామడుగు మండలం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసింది. వీటిపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఏవైనా ఉంటే 15 రోజుల్లో తెలపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News