Thursday, January 23, 2025

పార్టీ బలోపేతానికి బూత్ కమిటీల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

తెలకపల్లి: గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆదేశంతో ముమ్మరంగా గ్రామాలలో బిఆర్‌ఎస్ బూత్ కమిటీల ఎన్నిక ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రంథాలయ చైర్మెన్ మాధవరం హనుమంత రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కమ్మారెడ్డిపల్లి గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి రెడ్డపాకుల రమేష్ ఆధ్వర్యంలో గ్రామ బూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు బంగారయ్య, సిద్ధార్థ్ రెడ్డి, గ్రామ నాయకులు భరత్, విష్ణువర్ధన్ రావు, రాజు, యశ్వంత్, సుల్తాన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News