మన తెలంగాణ/హైదరాబాద్ : వైసిపి నేత, ఎపి మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్టయ్యారు. ముంబై ఎయిర్ పోర్టులో అహ్మద్ బాషా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. అహ్మద్ బాషాపై ఇదివరకే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో బొంబాయి ఎయిర్‌పోర్ట్ నుంచి కువైట్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అహ్మద్ బాషాను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అహ్మద్ బాషాను కడప పోలీసులకు అప్పగించారు. కడప ఎంఎల్‌ఎ మాధవి రెడ్డిని, మరికొందరిని దూషించిన కేసులో అహ్మద్ బాషా నిందితుడిగా ఉన్నారు. కడపలోని వినాయక నగర్‌లో ఓ స్థలం విషయంలో దాడి చేసినట్లు సైతం అహ్మద్ బాషా మీద కేసు నమోదైంది. పలు కేసుల్లో నిందితు డుగా ఉన్న అహ్మద్ బాషా మీద లోకౌట్ నోటీసులు జారీ కావడం విదితమే. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషాను సోమవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
ముంబై ఎయిర్ పోర్టులో వైసిపి నేత సోదరుడు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -