Saturday, November 16, 2024

ఎపి మాజీ మంత్రి నారాయణ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పద వ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవ హారంలో టిడి పి మాజీ మంత్రి, నారా యణ విద్యాసంస్థల అధినేత నారా యణను హైదారాబాద్‌లో కొండాపూర్‌లో ఐకీయా జంక్షన్ వద్ద కారులో వెళుతుండగా మం గళవారం నాడు చిత్తూరు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జ రిగిన పదో తరగతి ప్రశ్నా ప త్రాల లీకేజీల వ్యవహారంలో నిందితుల వాంగ్మూలం, కీలక ఆధారాల మేరకు నారాయ ణను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు ఎస్‌పి రిశాంత్ ప్రకటించారు. గత నెల 27న పదో తరగతి తె లుగు ప్రశ్న పత్రం వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ అయి ంద ని చిత్తూరు డిఇవొ ఇచ్చిన ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఈ కేసుకు సం బంధించి ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌పి తెలిపారు. విచా రణలో భాగంగా నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్నామ న్నారు. దర్యాప్తులో భాగంగా లభించిన వివరాలు, సాంకేతిక ఆధారాలతో పాటు నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నారాయణను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌పి వెల్లడించారు.

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో కారులో వెళ్తున్న నారాయణ దంపతులను అదుపులోకి తీసుకుని వారి సొంత కారులోనే ఎపికి తరలించామన్నారు. ఈక్రమంలో నారాయణపై పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చట్టం, సెక్షన్ 5, 8, 10 ఎపి పబ్లిక్ ఎగ్జామ్స్ చట్టంతో పాటు 408, 409, 201, 120 (బి), 65 ఐటి చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. చిత్తూరు జ్యుడీషియల్ కోర్టులో పోలీసులు నారాయణను హాజరుపరచి అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అరెస్ట్‌లో హైడ్రామా :

ఎపిలోని చిత్తూరు నుంచి వచ్చిన సిఐడి పోలీసులు మాజీ మంత్రి నారాయణను చిత్తూరు తరలిస్తున్న క్రమంలో నారాయణను అపహరించారంటూ ఆయన కుటుంబసభ్యులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనం నంబర్‌తో సహా వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు బెంగళూరు జాతీయ రహదారి వైపు నారాయణ వాహనం వెళ్తున్నట్లు నిర్ధారించుకుని ఆ మార్గంలోని కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తూరు కూడలి వద్ద నారాయణను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపిన అక్కడి పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో నారాయణతో పాటు చిత్తూరు పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధారించుకున్నారు. ఓ కేసులో భాగంగా మాజీ మంత్రిని తీసుకెళ్తున్నట్లు కొత్తూరు పోలీసులకు వారు చెప్పారు. దీంతో ఆ వాహనాన్ని అక్కడి నుంచి పంపేశారు. కాగా నారాయణ ఉన్న వాహనం ప్రస్తుతం చిత్తూరు వైపు వెళుతుండగా నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఎపి వెళ్లే మార్గంలో టోల్ గేట్ల వద్దకు చేరుకున్నారు.

పక్కా ఆధారాలతో అరెస్ట్ ః ఎస్‌పి రిశాంత్

నారాయణ విద్యా సంస్థల నుంచి పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు పక్కా ఆధారాలతో పాటు నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశామని చిత్తూరు జిల్లా ఎస్‌పి రిశాంత్ రెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల చైర్ పర్సన్‌గా నారాయణ కొనసాగుతున్నారా? ఇప్పటికే తప్పుకున్నారా? అన్న దానిపై తదుపరి విచారణ చేపడతామని ఎస్‌పి తెలిపారు. ఈ మేరకు నారాయణ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌పి రిశాంత్ వెల్లడించారు. నారాయణ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను బాగా చదివేవారు, చదవని వారిగా రెండు విభాగాలుగా విభజించారని తెలిపారు. తరువాత ఏఏ సెంటర్లలో ఈ పిల్లలున్నారో ముందుగా మాట్లాడుకున్న వారి ద్వారా ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడినట్లు తేలిందన్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న ఒక ఉపాధ్యాయుడి ద్వారా ప్రశ్న పత్రాన్ని ఫొటో తీసి, వాటికి సమాధానాలు రాసి తిరిగి లోపలికి పంపించేందుకు ప్రయత్నించారన్నారు. గతంలో కూడా వీరు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు మా దర్యాప్తులో తేలిందన్నారు.

గత రెండేళ్లుగా కరోనా వల్ల పరీక్షలు నిర్వహించలేదని, ఈ ఏడాది మళ్లీ పరీక్షలు రావడం ఒత్తిడి ఎక్కువై మంచి మార్కులు తీసుకురావాలనే దురాలోచనతో ఈ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ఎస్‌పి తెలిపారు. ప్రశ్న పత్రం తీసుకున్న తర్వాత వాటి కీ రెడీ చేసి అటెండర్స్, వాటర్ బాయ్స్, ముందుగానే ప్రలోభాలకు గురైన ఉపాధ్యాయుల ద్వారా సమాధానాలు లోపలికి పంపించేలా గతంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందన్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విద్యాసంస్థల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు. అయితే పట్టుబడిన ముద్దాయిల గత చరిత్రను పరిశీలిస్తే వీరంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినట్లు గుర్తించామన్నారు. 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసి 2014, 2015లో బయటకు వచ్చి వేర్వేరు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి మిగతా విద్యా సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామని ఎస్‌పి తెలిపారు. విచారణలో ఉన్నందున ప్రస్తుతం ఈ కేసులో నారాయణ పాత్ర, వాంగ్మూలంలో వివరాలు ఇప్పుడు వెల్లడించలేమని ఎస్‌పి తెలిపారు.

తెలుగు ప్రశ్నా పత్రం లీకేజీ ః

పదో తరగతి పరీక్షల్లో భాగంగా గత నెల 27న జరిగిన తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రాన్ని ముందుగానే బయటకు తెచ్చిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు కాసేపట్లోనే ఆయా ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసి పరీక్షా కేంద్రానికి పంపే యత్నం చేశారన్నారు. అయితే అప్పటికే తాము ఈ యత్నాన్ని అడ్డుకున్నామని తెలిపారు. తమ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు మంచి మార్కులు రావాలన్న ఉద్దేశ్యంతోనే నారాయణ విద్యా సంస్థలు ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆయన వివరించారు. గత 27న చిత్తూరు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని, ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశామని, తాజాగా నారాయణతో పాటు చిత్తూరు డీన్ బాల గంగాధర్‌ను కూడా అరెస్ట్ చేశామన్నారు. ఈకేసులో అరెస్ట్ అయిన నిందితులందరూ 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పని చేసిన వారేనని ఎస్‌పి వెల్లడించారు.

నారాయణ సహకరించారు ః

హైదరాబాద్‌లో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ సమయంలో ఆయన పోలీసులకు పూర్తిగా సహకరించారని ఎస్‌పి తెలిపారు. అరెస్ట్ సమయంలో ఆయన పారిపోయేందుకు యత్నించారన్న వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ జరుగలేదన్నారు. నారాయణను మాత్రమే తాము అరెస్ట్ చేశామని, నారాయణ భార్యను అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ కేసులో ఇతర విద్యా సంస్థలకు చెందిన వారి పాత్ర కూడా ఉందని, అయితే వారంతా కూడా గతంలో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వారుగానే తమ దర్యాప్తులో తేలిందని ఎస్‌పి తెలిపారు. నిందితుల చైన్ లింక్లో చైర్మన్ నారాయణ వరకు ఆధారాలు లభించాయని, నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ వ్యవహారం చోటుచేసుకుందన్నారు. ఈ కేసులో నారాయణ తప్పు చేశారని తేలితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని ఎస్‌పి వివరించారు.

హైదరాబాద్‌లో నిఘా ః

ఎపి పోలీసులు గత మూడు రోజులుగా మాజీ మంత్రి నారాయణకు చెందిన కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిల నివాసాల వద్ద చిత్తూరు పోలీసులు గస్తీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో మార్చి మార్చి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించడంతో పాటు ఏ రోజు ఎక్కడ ఏ టైమ్‌కు ఉంటున్నారో కూడా పోలీసులు సమాచారం సేకరించారు. ఎపి నుంచి వచ్చిన పోలీసులు తెలంగాణ పోలీసులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నిఘా సారించారు. కాగా నారాయణ నివాసాలలో అన్నింటి కామన్ గా ఉన్న ఐకీయా జంక్షన్ వద్ద ఎపి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం నాడు అదే దారి మీదుగా వెళ్తున్న నారాయణను ఎపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News