Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసు ఘటనలో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు లో విచారణ జరిగింది. నరేం దర్ రెడ్డికి చర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం అనుమతించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు రిమాండ్‌లో ఉన్న కొడంగల్ బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చిన విషయం విదితమే.

పోలీసులు తన పేరుతో బయటకు వచ్చిన కన్పెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు. కెటిఆర్ గురించి కానీ, ఈ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని, తాను ఏమీ చెప్పలేదు అని వెల్లడించారు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు అని పేర్కొన్నారు. అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదు అని మాజీ ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. తాను పోలీసులకు చెప్పనిదే చెప్పినట్లు రాశారు అని కొండగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News