Sunday, January 19, 2025

కెటిఆర్‌ను ఎవరో తప్పుదోవ పట్టించారు

- Advertisement -
- Advertisement -

నా అల్లుడు సృజన్ రెడ్డి సిఎంకు సొంత బావమరిది కాదు
రేవంత్ రెడ్డి చిన్న మామ కుమారుడు
బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ ఉపేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ‘అమృత్’ పథకం టెండర్ల విషయంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎవరో తప్పుదోవ పట్టించారని బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కెటిఆర్‌కు అన్ని విషయాలు వివరిస్తానని, వాస్తవాలు చెబుతానని తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలకు, వ్యాపారానికి సంబంధం లేదని పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో లబ్ది పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని ఆరోపించారు. తన అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, రేవంత్ రెడ్డి చిన్న మామ కుమారుడు సృజన్ రెడ్డి అని ఆయన తెలిపారు. సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమని, అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు.

అమృత్ టెండర్ల వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. కెటిఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, ఆయనను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని, వాస్తవాలు చెబుతానని ఉపేందర్ రెడ్డి చెప్పారు. అర్హత లేదు కాబట్టే జాయింట్ వెంచర్‌కు వెళ్లారని, రాజకీయం చేయడం తగదని సూచించారు. టెండర్లకు, ముఖ్యమంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సివికికి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుతుంటారని, మంత్రి పొంగులేటిపై కూడా ఎన్నో వచ్చాయని, అయినా తాను ఏమీ మాట్లాడలేదని తెలిపారు. వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు అని, రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. వ్యాపారానికి తాను రాజకీయాలను ఎప్పుడూ వాడుకోలేదని చెప్పారు. తాను బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News