- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్‌కు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ క్షమాపణలు తెలిపారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించి కాగ్ నివేదికలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చేర్చవద్దంటూ తనపై ఒత్తిడి తెచ్చిన ఎంపీలలో సంజయ్ నిరుపమ్ ఒకరంటూ తాను తప్పుగా ప్రస్తావించానని, అందుకు తాను ఆయనకు క్షమాపణలు చెబుతున్నానని వినోద్ రాయ్ గురువారం తెలిపారు. 2014లో రాసిన ఒక పుస్తకంలో వినోద్ రాయ్ తనపై ఈ ఆరోపణలు చేయడమేగాక మీడియాకు ఇచ్చిన అనేక ఇంటర్వూలలో ఇదే ఆరోపణలు పదేపదే చేసినందుకు ఆయనపై నిరుపమ్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. వినోద్ రాయ్ క్షమాపణలతో నిరుపమ్ సంతృప్తి చెందడంతో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం పాటియాలా హౌస్‌లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కేసును కొట్టివేసింది.
- Advertisement -