Wednesday, January 8, 2025

బిజెపిలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేసిన రెండు రోజులకే అభిజిత్ గంగోపాధ్యాయ గురువారం బిజెపిలో చేరిపోయారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన అనంతరం తాను త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. గురువారం అధికారికంగా బిజెపిలో చేరిన అనంతరం గంగోపాధ్యాయ విలేకరులతో మాట్లాడుతూ తాను కొత్త రంగంలోకి ప్రవేశించానని చెప్పారు.

బిజెపిలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ సైనికుడిగా తాను పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో అవినీతికర టిఎంసి ప్రభుత్వాన్ని గద్దెదించడమే తన లక్షమని ఆయన ప్రకటించారు. పాల్ట్ లేక్ లోని బిజెపి కార్యాలయం వద్ద గంగోపాధ్యాయకు ఘన స్వాగతం లభించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు పార్టీ పతాకాన్ని అందచేసి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News