Wednesday, January 22, 2025

ప్రాణదాతకు సెల్యూట్…..

- Advertisement -
- Advertisement -

ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సన్మానించిన జెడి లక్ష్మీనారాయణ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆపత్కాలం లో సాటి మనిషి ని ఆదుకోవడంకి మించిన మానవత్వం లేదని, అటువంటి వారు అందరూ మహానుభావులే అని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఇటీవల అత్తాపూర్ దగ్గర బాలాజీ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండె నొప్పితో పడిపోతే ,అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ తక్షణమే స్పందించి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం విదితమే, ఇటువంటి గొప్ప మానవతా మూర్తి ని స్వయంగా కలుసుకోవాలని, కానిస్టేబుల్ రాజశేఖర్‌ని స్వయంగా తన జెడి ఫౌండేషన్ కార్యాలయానికి పిలిపించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వృత్తిలో నిబద్ధత కలిగి, సేవాభావం తో పని చేయడం గొప్ప విషయం అని, అటువంటి పని చేసిన రాజశేఖర్ గొప్ప మానవతామూర్తి అని ప్రశంసించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రాజశేఖర్ మాట్లాడుతూ తన జీవితంలో ఈ రోజు మరిచిపోని రోజు అని, జెడి లక్ష్మీనారాయణని స్వయంగా కలవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అని, ఆయన స్వయంగా తనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడి ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ తో పాటు, న్యాయ విద్యార్థి మనిదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News