Sunday, December 22, 2024

బందిపోటు మల్కాన్ భార్య సర్పంచ్

- Advertisement -
- Advertisement -

Former Chambal dacoit wife elected sarpanch in MP

 

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయలో పేరు మోసిన బందిపోటు మల్కాన్‌సింగ్ భార్య లలితా రాజ్‌పుత్ సర్పంచ్ అయ్యారు. గుణ జిల్లాకు చెందిన సుంగాయయి గ్రామానికి లలిత ఏకగ్రీవ సర్పంచ్ అయ్యారు. అప్పట్లో మల్కాన్ సింగ్ అంటే అంతా గడగడలాడేవారు. ఆయనపై వందకు పైగా కేసులు ఉన్నాయి. అర్జున్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1982లో సింగ్ లొంగిపొయ్యారు. ఆయన ఇప్పుడు సుంగాయయి గ్రామంలో ఉంటున్నారు. మధ్యప్రదేశ్‌లో సర్పంచ్‌ల ఎన్నికలు ఈ నెల 25న ఆరంభం అవుతాయి. అయితే ఎవరూ పోటీ లేకపోవడంతో లలితా రాజ్‌పుత్ గ్రామానికి ముందుగానే సర్పంచ్ అయ్యారు. ఇప్పటికీ గ్రామానికి కరెంటు లేదు నీరు రాదని , ఈ సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News