Monday, January 13, 2025

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ ఎం కృష్ణ(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 1999 నుంచి 2004 మధ్య కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ పని చేశారు. 2004-08 మధ్య మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. 2009-12 మధ్య విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. రాజకీయ నాయకుడిగా సేవలందించినందుకు 2023లో పద్మవిభూషణ్ అవార్డు ఆయనను వరించింది.

1932 మే 1న కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలోని సోమనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన భార్య ప్రేమ, కూతురు మాళవిక కృష్ణ ఉన్నారు. 1967లో పిఎస్‌పి నుంచి ఎంఎల్‌ఎగా గెలిచారు. అనంతరం 1968లో మాండ్య లోక్ సభ్య సభ్యుడిగా గెలిచారు. ఆయన కేంద్ర పరిశ్రమల, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, కర్నాటక శాసన సభ స్పీకర్, కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవకుడిగా పని చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News