- Advertisement -
బీజింగ్ : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. ల్యుకేమియా, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఆయన షాంఘైలో మధ్యాహ్నం 12.13 గంటలకు మరణించినట్టు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంట్, కేబినెట్, సైన్యం ఆయన మరణాన్ని ధ్రువీకరిస్తూ చైనా ప్రజలకు ఓ లేఖను విడుదల చేశాయి. కామ్రేడ్ జియాంగ్ జెమిన్ మరణం వల్ల కమ్యూనిస్టు పార్టీకి,సైన్యానికి , అన్ని రకాల దేశీయ వర్గాల ప్రజలకు పూడ్చలేని నష్టం జరిగినట్టు తెలిపాయి. అసాధారణ నేత అని, అత్యున్నత స్థాయి గౌరవనీయుడని , గొప్ప మార్కిస్టు, పక్ష, మిలిటరీ స్ట్రాటజిస్ట్, దౌత్యవేత్త, సుదీర్ఘ పరీక్షలకు నిలిచిన కమ్యూనిస్ట్ యోధుడని కీర్తిస్తూ నివాళి అర్పించాయి.
- Advertisement -