Monday, December 23, 2024

అమరీందర్ సింగ్‌కు కరోనా పాజిటివ్..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అమరీందర్ సింగ్ బుధవారం ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలుసుకున్న వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 79 ఏళ్ల అమరీందర్ ఇటీవలే సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితమే అమరీందర్ సతీమణి, కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.

Former CM Amerinder Singh Test Positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News