Thursday, January 23, 2025

మాజీ సిఎం చంద్రబాబు అరెస్టు సబబు కాదు:  రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ సబబు కాదని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి ఈ అరెస్టును తప్పుబడుతోందని ఆయనను ఎలాంటి వివరణ లేకుండా అరెస్టు చేశారని ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎఫ్‌ఎస్‌ఐఆర్‌లో పేరు చేర్చలేదన్నారు. చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో శనివారం ఉదయం అరెస్ట్ చేసి ఏసిబి కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారన్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా చేస్తోందని తెలిపారు.

మాజీ రాష్ట్రపతి నివేదిక వచ్చిన అనంతరం పార్లమెంట్లో బిల్లు పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మార్చిలో కానీ ఏప్రిలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్, డిసెంబర్‌లో జరుగుతాయని చెప్పారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని తమ పార్టీ ఉధృతం చేసిందని, ఈనెల 13న జాబ్ క్యాలెండర్ విడుదల, ఖాళీల భర్తీ చేయాలంటూ 24 గంటల పాటు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 13న ఇందిరా పార్కు వేదికగా 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుందన్నారు. యువత పెద్ద సంఖ్యలో హాజరై దీక్షను విజయవంతం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పేద ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నామని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News