హైదరాబాద్: మాజీ సిఎం కొణిజేటి రోశయ్య శనివారం కన్నుశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని స్టార్ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పనిచేశారు. రోశయ్య ఎపి రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో ఆయన జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం చేశారు. రోశయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడు. నిడుబ్రోలులో రోశయ్య రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో ఆయన తొలిసారి మండలికి ఎన్నికైయ్యారు. 1968,1974,1980లో కాంగ్రెస్ తరుపున మండలికి ఎన్నికయ్యారు. తొలిసారి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్అండ్ బి, రవాణా శాఖ మంత్రిగా రోశయ్య సేవలందించారు. ఉమ్మడి ఎపిలో ఆయన సుదీర్ఘకాలం ఆర్థికమంత్రి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రోశయ్య సిఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఎపికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయనేతలు సంతాపం ప్రకటించారు.
మాజీ సిఎం రోశయ్య కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -