Thursday, January 23, 2025

ప్రముఖ నిర్మాత భార్య, మాజీ సిఎం కూతురు వరలక్ష్మీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మీ కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ ఆమె చనిపోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వరలక్ష్మీ ఉమ్మడి మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురు. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. జబర్దస్త్ కామెడీ షో ప్రయోగం సక్సెస్ కావడంతో ఆమె పాత్ర కూడా ఉన్నట్టు సినీ వర్గాల పేర్కొన్నాయి. ఆమె మృతి చెందిందని తెలియగానే సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News