Wednesday, April 9, 2025

మాజీ సీఎం లాలూకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం పాట్నా విమానాశ్రయానికి తరలిస్తుండగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 4.05 గంటలకు ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సిన ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైద్య నిపుణులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధునాతన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News