- Advertisement -
హైదరాబాద్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింఘ్ వాఘేలా శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తో దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు.. కెసిఆర్ జాతీయ పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కలవడం దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి దేశంలో పెను మార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సిఎం కెెసిఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో వరస సమావేశాలు నిర్వహిస్తున్న ముచ్చట తెలిసిందే.
- Advertisement -