- Advertisement -
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్‌గా మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నియామకమయ్యారు. ప్రొటెం స్పీకర్ రాం విచార్ నేతమ్ విజ్ఞప్తి మేరకు సీఎం విష్ణుదేవ్ సాయి, ప్రతిపక్షనేత చరదాస్ మహంత కలిసి రమణ్‌సింగ్‌ను స్పీకర్ ఛైర్ వరకు తీసుకెళ్లి కూర్చుండబెట్టారు.
అనంతరం సీఎం, ప్రొటెం స్పీకర్ , ప్రతిపక్షంతోపాటు మాజీ సీఎం భూపేశ్ బఘేల్ సహా సీనియర్ నేతలంతా రమణ్‌సింగ్‌కు అభినందనలు తెలిపారు. 15 ఏళ్ల పాలన, సమర్ధవంతమైన నాయకుడంటూ నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా స్పీకర్ రమణ్‌సింగ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త బాధ్యతను సమర్ధంగా నిర్వహిస్తూ రాష్ట్ర అసెంబ్లీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. రమణసింగ్ అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ వేసే ముందు బీజేపీ జాతీయ ఉపాధ్య రాజీనామా చేశారు.
- Advertisement -