Friday, December 27, 2024

మాజీ సిఎం సోరెన్ రిమాండ్ మరో ఐదు రోజులు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రిమాండ్‌ను మరో ఐదు రోజులు ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు బుధవారం పొడిగించింది. భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2న సోరెన్‌కు ఐదు రోజుల రిమాండ్ విధించగా, బుధవారం ఆ రిమాండ్ ముగియడంతో మరో ఐదు రోజులు కోర్టు పొడిగించింది.

“ఈడీ ఏడు రోజుల రిమాండ్ కోరగా, జనవరి 20న ఎనిమిది గంటలు, జనవరి 31న మరో ఎనిమిది గంటల పాటు విచారించినందున, తదుపరి రిమాండ్ అక్కర లేదని తాము వాదించామని ” సోరెన్ తరఫు న్యాయవాది అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్ విలేఖరులకు తెలియజేశారు. ఇదే కాకుండా ఐదు రోజుల్లో సోరెన్‌ను మొత్తం 120 గంటల పాటు విచారించారు. ఈడీ ఈరోజు పిటిషన్‌లో భూ వ్యవహారంతో సంబంధం లేని అంశాలను లేవనెత్తిందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు మాజీ సిఎంను కస్టడీలో ఉంచాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గాలీ వెలుతురు రాని కింద ఫ్లోర్ దిగువ గదిలో నిర్బంధించారని అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్ కోర్టు దృష్టికి తెచ్చారు. బుధవారం ఉదయం భారీ భద్రత మధ్య కోర్టుకు తీసుకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News