Sunday, December 22, 2024

ఎంపి టికెట్ నిరాకరణతో ఆప్‌లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్‌ఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్‌ఎల్‌ఎ దల్వీందర్ సింగ్ గోల్డీ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దల్వీందర్ కాంగ్రెస్ నుంచి సంగూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం దల్వీందర్ సింగ్‌కు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానానికి మూడుసార్లు ఎమ్‌ఎల్‌ఎగా గెలిచిన సుఖ్‌పాల్ సింగ్ ఖైరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పంజాబ్ ఆప్ సిఎం భగవంత్ మాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దల్వీందర్ సింగ్ పార్టీ చేరికపై భగవంత్‌మాన్ మాట్లాడుతూ గోల్డీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆప్ తనకు ఏ బాధ్యత అప్పచెప్పినా విజయవంతంగా నిర్వహిస్తామని దల్వీందర్ పేర్కొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌కు రాసిన రాజీనామా లేఖలో గోల్డీ , రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News