Sunday, December 22, 2024

ఆప్ గూటికి కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

Former Congress MLA joins AAP

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్‌ఎల్‌ఎ ఇంద్రనీల్ రాజ్‌గురు గురువారం రాజ్‌కోట్‌లో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) లో చేరారు. గుజరాత్‌లో కాషాయ పార్టీని ఓడించేందుకు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆప్ మేలైన వేదికగా ముందుకొచ్చిందని ఇంద్రనీల్ అన్నారు. ప్రజలను మభ్యపెట్టి బీజేపీ అధికారం లోకి రాగా, దీటైన ప్రత్యామ్నాయంగా ఎదగడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఇంద్రనీల్ రాజ్‌గురు 2012 లో రాజ్‌కోట్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ గా గెలుపొందారు. 2017 లో సీఎం విజయ్ రూపానీపై పోటీ చేసేందుకు ఆయన తన సురక్షిత నియోజకవర్గాన్ని విడిచి రాజ్‌కోట్ వెస్ట్‌లో పోటీ చేసి ఓటమి పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News