- Advertisement -
హిస్సార్: టీమిండియా మాజీ అల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను ఆదివారం హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఈవెంట్‌లో తోటి క్రికెటర్‌పై కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిందుకుగాను యువరాజ్ సింగ్‌ను హర్యానాలోని హాన్సి పోలీసులు అరెస్టు చేశారు. ఆపై ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. గత ఏడాది క్రికెటర్ యజేవేంద్ర చాహల్‌పై కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో యువరాజ్‌పై కేసు నమోదైంది. దీంతో ఆయన తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దర్యాప్తుకు సహకరించాలన్న కోర్టు ఆదేశాల మేరకు యువరాజ్ ఆదివారం దర్యాప్తు అధికారి వద్దకు రాగా అరెస్టు చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు హాన్సి ఎస్‌పి నితికా గెహ్లోట్ తెలిపారు.
- Advertisement -