Friday, December 20, 2024

పంత్‌ను పరామర్శించిన టీమిండియా మాజీ క్రికెటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను టీమిండియా మాజీ క్రికెటర్లు పరామర్శించారు. సురేశ్‌రైనా, హర్భజన్‌ సింగ్, శ్రీశాంత్‌ రిషబ్‌ ఇంటి కెళ్లి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు అతనితో సరదాగా గడిపారు. అనంతరం ఆక్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గతేడాది చివరిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ మెల్లిగా కోలుకుంటున్నాడు. కారు ప్రమాదానికి గురైన పంత్‌కు ఆ తర్వాత మోకాలికి సర్జరీ జరిగింది. దీని కారణంగా చాలా కాలం నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News