Sunday, January 19, 2025

మాజీ డిసిపి రాధాకిషన్ కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా రెండో రోజు టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావును పోలీసులు విచారిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. రాధా కిషన్ రావువు హైబిపి రావడంతో వైద్యులకు దర్యాప్తు బృందం సమాచారం ఇచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే రాధా కిషన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోన్ ట్యాపింగ్ కేసులో ఎ4గా రాధాకిషన్ ఉన్న విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. పది రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరారు. పోలీస్ కస్టడీకి ఏడు రోజులు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు రాధాకిషన్ రావు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News