Friday, December 20, 2024

బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొంతమంది మాజీ కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు. మాజీ సిటీ ప్రభుత్వ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్, మాజీ ఎమ్‌ఎల్‌ఎలు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్ బీజేపీలో చేరారు. మాజీ కాంగ్రెస్ నాయకులంతా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ లోని ఆమ్‌ఆద్మీపార్టీ విపక్షాతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించారు.

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. పార్టీలో చేరడానికి తమకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వాన్ని, ప్రధాని మోడీని అర్విందర్ సింగ్‌లవ్లీ ప్రశంసించారు. ఆప్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడాన్ని విమర్శిస్తూ అర్విందర్‌సింగ్ ఇటీవలనే ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News