Wednesday, January 22, 2025

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు బెయిలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు మనీలాండరింగ్ కేసులో స్థానిక కోర్టు బెయిలు మంజూరు చేసింది. రెండేళ్ల కిందట ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఆయనను అరెస్టు చేసింది. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆయనకు బెయిలును మంజూరు చేసింది.

విచారణలో జాప్యం, 18 నెలల సుదీర్ఘ జైలు శిక్ష, విచారణ ప్రారంభించడానికి చాలా సమయం పడుతుందన్న విషయం పరిగణనలోకి తీసుకుంటే అతడు కాస్త ప్రశాంతంగా ఉంటాడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే అన్నట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన ఆప్ నాయకుల్లో జైన్ మూడో వ్యక్తి. దీనికి ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లకు కూడా బెయిల్ లభించింది. ఇదిలావుండగా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తమపై దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నదని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News