Sunday, January 19, 2025

బిజెపిలో చేరిన ఆప్ నేత కైలాష్ గహ్లోట్

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆది పార్టీ(ఆప్)కు రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కమలం జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, ఆదివారం ఆప్ పార్టీకి, మంత్రి పదవికి కైలాష్ రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న ఆప్ కు రాజీనామా చేసిన కైలాష్.. ఇవాళ బిజెపిలో చేరడంతో చర్చనీయాంశంగా మారింది. ముందుగానే నిర్ణయించుకుని ఆప్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కైలాష్ రాజీనామాపై ఆప్ నేతలు బిజెపి ఆగ్రహం వ్యక్తం చేశారు. కైలాష్ ను ఈడీ, సీబిఐ దర్యాప్తు సంస్థల ద్వారా భయపెట్టడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News