జైలు నుంచి తక్షణమే విడుదల చేయలని బొంబే హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ బొంబే హైకోర్టు ఉపశమనం కలిగించింది. గత ఐదుసంవత్సరాలపాటు అర్బన్ నక్సల్ ఆరోపణలతో జైలులో ఉన్న సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ రోహిత్ డియో, పన్సారేతోకూడిన ద్విసభ్య బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ట్రయల్ కోర్టు తనకు జీవితఖైదు విధించడాన్ని సాయిబాబా హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సాయిబాబా వినతిని విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న సాయిబాబా ఆరోగ్యం క్షీణించడంతో వీల్‌చైర్‌కి పరిమితమయ్యారు. ఐదు సంవత్సరాలుపాటు జైలు జీవితం గడుపుతున్న ఆయనకు హైకోర్టు నిర్దోషిగా తీర్పునివ్వడంతో ఊరట లభించింది. కాగా ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న అర్బన్ నక్సల్ ట్యాగ్ పూర్తిగా అవాస్తవమని తేలిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.ఇంకా చాలామంది అర్బన్ నక్సల్ ఆరోపణలతో జైలు జీవితం గడుపుతున్నారన్నారు. తనను కూడా ప్రధాని మోడీ వారిలో ఒకరిగా ఆశ్చర్యం కలగదని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.