Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ డిప్యూటీ సిఎం సవాది

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మాజీ ఉప ముఖ్యమంత్రి సవాది బిజెపిను వీడి నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు బిజెపి అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో సవాది ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఎల్‌సి పదవితోపాటు బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి చేసినట్లు సవాదిప్రకటించారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్‌లో శుక్రవారం చేరనున్నట్లు తెలిపారు. శివకుమార్‌తోపాటు అసెంబ్లీలో ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, పార్టీ కర్ణాటక ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాతో సవాది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సవాదితో తమ సమావేశం ఆత్మీయంగా జరిగిందన్నారు.

సవాది హుందాతనం, అధికార స్థాయి తమకు తెలుసునని ఆయన కాంగ్రెస్ కుటుంబంలో చేరేందుకు అంగీకరించారు. పార్టీ భావజాలం, నాయకత్వాన్ని అంగీకరించి కాంగ్రెస్‌లో చేరుతున్నారని డికె తెలిపారు. కాగా సవాది బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం విచారకరమని సిఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బెలగావి జిల్లా అతానీ నుంచి మూడుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన సవాది మరోసారి అతానీ నుంచి పోటీచేసేందుకు బిజెపి టికెట్‌ను ఆశించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీచేసేందుకు సిట్టింగ్ ఎంఎల్‌ఎ మహేశ్ కుమతల్లికి అధిష్ఠానం టికెట్ కేటాయించింది. కాగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న సవాది బిజెపి అభ్యర్థి కుమతల్లి చేతిలో ఓటమిపాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News