Friday, January 17, 2025

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డిజిపి నియామకం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్ తోపాటు బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను గవర్నర్ అమోదించడంతో ప్రభుత్వం కొత్త చైర్మన్, సభ్యులను నిమించింది. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు బోర్డు సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర‌, పాల్వాయి ర‌జ‌నీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాద‌య్య‌, వై రాంమోహ‌న్ రావులను కాంగ్రెస్ సర్కార్ నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News