Wednesday, January 22, 2025

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ డిజిపి మహేందర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డిజిపి మహేందర్‌ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితా రామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీ కుమారి, అనితా రాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. రెండు రోజుల కిందట టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కొత్తగా చైర్మన్ నియమితులైన మహేందర్‌ రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు. టిఎస్‌పిఎస్‌సి నిబంధనల ప్రకారం చైర్మన్‌గా కమిషన్ సభ్యులుగా నియమితులైన వారు 62 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. 1962లో డిసెంబర్3న జన్మించిన మహేందర్‌ రెడ్డికి ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. ఇంకో 11 నెలలు ఆయనకు 62 సంవత్సరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News