Thursday, February 13, 2025

కాంగ్రెస్ లో చేరిన మాజీ డిఎస్పీ గంగాధర్

- Advertisement -
- Advertisement -

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎం. గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగాధర్ ఇంకా నామినేషన్ ఉప సంహరించుకోలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల డిఎస్పీ పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావుతో పాటు సచివాలయానికి వచ్చిన గంగాధర్ కు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికార అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని మంత్రి ఆయనకు సూచించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News