Sunday, December 22, 2024

నన్ను పిఆర్ స్టంట్ కోసం వాడుకున్నారు:మాజీ డిఎస్పీ నళిని

- Advertisement -
- Advertisement -

మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ‘తనను పిఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ ఉద్యోగిని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె ఆచూకీ తెలుసుకొని సిఎంను కలవాలంటూ మాజీ డీఎస్పీ నళినికి కబురు పంపారు. అప్పట్లో నేరుగా ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. నళినికి పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా సిఎం రేవంత్ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా నళిని తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె అధ్యాత్మిక మార్గంలో ఉన్నానని,

ఉద్యోగం చేసుందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిట్‌నెస్ తాను లేనని చెబుతూ ప్రభుత్వం సాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సాయం చేయాలని ఆమె అడిగారు. దీనికి సంబంధించి రెండు వినతిపత్రాలను సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. సిఎం రేవంత్ రెడ్డిని నళిని కలిసి దాదాపు ఏడు నెలలు అవుతున్నా ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సారి కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News