Sunday, January 19, 2025

జల సంరక్షణలో తెలంగాణ భేష్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ మెట్ల బావికి పూర్వ వైభవం
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ

తెలంగాణలోని సికింద్రాబాద్ బన్సీలాల్ పేట మెట్లబావి పునరుద్ధరణతో పూర్వవైభవం తీసుకురావడం సంతోషదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ఆయన ఈ మెట్లబావి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జల పరిరక్షణ అత్యంత కీలకం. ఈ దిశలోనే బన్సీలాల్‌పేట మెట్లబావిని పునరుద్ధరించిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ అత్యద్భుత పురాతన కట్టడమైన బావిలో ఇంతవరకూ నిర్లక్షంతో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు, బురదలను స్థానిక అధికారులు నిర్మూలించి బావిని తీర్చిదిద్ది ఇంతకు ముందటి కళకు తీసుకువచ్చారని ప్రధాని కితాబు ఇచ్చారు. తెలంగాణలోని పురపాలక పట్టణాభివృద్ధి పరిపాలనా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాల పరిరక్షణ తద్వారా జలల పరిరక్షణ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిసిందని దీనిని తాను అభినందిస్తున్నానని తెలిపారు.

ఈ సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మెట్లబావి పునరుద్ధరణ జరిగింది. హైదరాబాద్ ఇతర ప్రాంతాలలోని పురాతన బావులను కూడా తీర్చిదిద్దారు. జిహెచ్‌ఎంసి వర్షపు నీరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో మరమ్మతు పనులను బాగా చేపట్టారని ప్రధాని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు 140 వరకూ మెట్లబావుల మరమ్మత్తుల పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా భగవానంద బాగ్ బౌలి, శివబాగ్ బౌలి (గుడిమల్కపూర్ వద్ద) ఇతరాలను ఇప్పటికే పునరుద్ధరిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News