Monday, January 20, 2025

తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ టిడిపి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజవకవర్గం ఏఎస్‌రావునగర్ డివిజన్‌కు చెందిన దూడల నిర్మా లసాం బమూ ర్తిగౌడ్‌ను టిడిపి రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఈమేరకు మంగళవారం కాప్రాలో ఏర్పాటు చేసిన సమావేశానికి షకీలారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్మాలగౌడ్‌కు నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి హయంలోనే హైదరబాద్ నగరం అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ద్ది చేసుకునేందుకు రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకుంద్దామని అన్నారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కసాని జ్ఞనేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని అన్నారు.

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందరూ సమష్టిగా కృషి చేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ప్రధాన కార్యదర్శి నిర్మాలగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు కృషి చేసిన జాతీయ పార్టీ అధ్యక్షుడు నార చంద్రబాబునాయుడు,ప్రధాన కార్యదర్శి నార లేకేష్‌బాబు,టిటిడిపి అధ్యక్షుడు కసానిజ్ఞనేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు అరవిం ద్ కుమా ర్‌గౌడ్, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్,టిజికే మూర్తిలకు కృతజ్ఞతలు తెలిపారు

.కార్యక్రమంలో టిడిపి బిసిసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల సాంబ మూర్తిగౌడ్, నాయకులు సురేష్‌సాగర్, నాగభైరవ సాంభశివరావు, శివానంద్, ఎంసి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News