Thursday, January 23, 2025

ఆలయాలకు పూర్వ వైభవం

- Advertisement -
- Advertisement -

మక్తల్:  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ధూప దీప నైవేద్య పథకం ద్వారా ఎంపిక చేసిన 45ఆలయాల అర్చకులకు ప్రొసీడింగ్ పత్రాలను ఆయన అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 35ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతి నెలా రూ.6వేలను నిర్వహణ ఖర్చులకు గానూ అర్చకులకు అందిస్తుండగా, కొత్తగా మరో 45ఆలయాలకు వర్తింపచేశామన్నారు. ఆలయాల్లో నిత్య పూజలను నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భీమాచారి, అర్చకులు ప్రాణేష్ చారి, అరవింద్, ధూప దీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షులు తిప్పయ్య స్వామి, బిఆర్‌ఎస్ నాయకులు దేవరి మల్లప్ప, మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News