Sunday, December 22, 2024

కేసీఆర్ పాలనలో దేవాలయాలకు పూర్వ వైభవం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేవాలయాలకు పూర్వ వైభవం సంతరించుకుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని శ్రీ గుంటి రఘునాథ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇందిరా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసిం హ సుదర్శన యాగాన్ని ఎమ్మెల్యే దంపతులు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకున్నాయని అన్నారు.

కేసీఆ ర్ సర్కార్ కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయని అన్నారు. ప్రజల్లో నూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తున్నదని అన్నారు. భూలోక వైకుంఠం యాదగిరి దివ్యక్షేత్రం అద్భుతమైన శిల్పకళతో యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. చిన్న గుడి నుంచి పెద్ద ఆలయాల వరకు ధూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారని ఆయన తెలిపారు. ధూప దీప నై వేద్య పథకం ద్వారా ఆలయ ఆర్చకులకు 6వేల నుండి 10వేల రూపాయల గౌరవ వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

మైనార్టీ ప్రార్థనా మందిరాలకు సైతం పూర్వ వైభవం తెచ్చారని, సర్వమతాల పండుగలను అ ధికారికంగా నిర్వహిస్తూ సర్వమత సామరస్యాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషితో రాష్త్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని తెలిపారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో 26 ఆలయాలలో ధూప దీప నైవేద్య పథకం అమలు అవుతోందని తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పెళ్లి రోజు కావడంతో అ ధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, పార్టీ నాయకు లు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గుడి ఛైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అర్చకులు, భక్తులు, ప్రభుత్వ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News