Sunday, January 19, 2025

కాంగ్రెస్ సీనియర్ నేత కమలా బేనివాల్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కాగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనివాల్ బుధవారం జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దికాలంగా అరారోగ్యంతో బాధపడుతున్న 97 సంవత్సరాల బేనివాల్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె కుటుంబ వర్గాలు తెలిపాయి. బేనివాల్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు జరుగుతాయని వారు చెప్పారు.

గుజరాత్‌తోపాటు త్రిపుర, మిజోరం గవర్నర్‌గా కూడా బేనివాల్ బాధ్యతలు నిర్వహించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బేనివాల్ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇదేగాక రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఆమె పనిచేశారు. బేనివాల్ మృతి పట్ల రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి మోహన్‌లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News