Friday, November 22, 2024

గుజరాత్ మాజీ సిఎం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Gujarat CM Madhavsinh Solanki Passes Away

గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌సింగ్ సోలంకి(94) కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మాధవ్‌సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పని చేశారు. 1980లో ఎన్నికలకు ముందు కెహెచ్ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. న్యాయవాది అయిన సోలంకి 1976లో కొంతకాలం గుజరాత్ సిఎంగా పని చేశారు. మళ్లీ 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను ఆయన ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ ఆ తర్వాత 182 అసెంబ్లీ సీట్లకు గాను 149  సీట్ల భారీ మెజార్టీతో మరొసారి అధికారంలోకి వచ్చారు.  సోలంకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలిపారు. గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌సింగ్ సోలంకి బలీయమైన నాయకుడని వారు  కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్‌సింగ్ సోలంకి కుమారుడు భరత్‌తో మాట్లాడి సంతాపం తెలిపినట్లు పిఎం మోడీ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News